- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విదేశీ మహిళపై అత్యాచారం
<p>దిశ, వెబ్‌డెస్క్: అమెరికాకు చెందిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన 37 ఏళ్ల మహిళ యోగా గురించి తెలుసుకునేందుకు 2017 నుంచి ఆధ్మాత్మిక పట్టణమైన రిషికేశ్‌లో నివసిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు స్థానిక యువకుడైన అభినవ్ రాయ్‌తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 5వ తేదీన బాల్కానీలో నుంచి తన ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారానికి పాల్పడ్డాడని సదరు మహిళ పోలీసులకు […]</p>

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాకు చెందిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన 37 ఏళ్ల మహిళ యోగా గురించి తెలుసుకునేందుకు 2017 నుంచి ఆధ్మాత్మిక పట్టణమైన రిషికేశ్‌లో నివసిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు స్థానిక యువకుడైన అభినవ్ రాయ్‌తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 5వ తేదీన బాల్కానీలో నుంచి తన ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారానికి పాల్పడ్డాడని సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే అభినవ్ రాయ్‌తో సదరు మహిళకు లైంగిక సంబంధం ఉన్నట్లు విచారణలో తేలిందని రిషికేశ్ పోలీసు అధికారి ఆర్కే సక్లానీ పేర్కొన్నారు. అమెరికా మహిళకు యోగా, డ్రగ్స్‌పై ఉన్న ఇష్టమే ఆమెను అభినవ్‌కు దగ్గర చేశాయని వెల్లడించారు. మరోవైపు తన కొడుకుపై పెట్టిన కేసును వెనక్కు తీసుకోవాలంటూ నిందితుడి తండ్రి ఒత్తిడి తెస్తున్నట్లు బాధిత మహిళ తెలిపింది.






