కరోనాను ఎదుర్కోవడానికి అదొక్కటే మార్గం: బైడెన్

by  |
కరోనాను ఎదుర్కోవడానికి అదొక్కటే మార్గం: బైడెన్
X

వాషింగ్టన్ : ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదవుతున్న అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. లైఫ్ అండ్ డెత్ రేస్‌లో వైరస్ మహమ్మారా..? లేక వ్యాక్సినేషనా..? అన్నట్టుగా దూకుడుగా వ్యవహరిస్తున్నది. కరోనా నిబంధనల పాలనతోపాటు వైరస్‌ను ఎదుర్కోవడానికి టీకానే అస్త్రమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. వైట్‌హౌజ్‌లో ప్రసంగిస్తూ టీకా పంపిణీపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరో రెండు వారాల తర్వాత వయస్సు, ఆరోగ్య సమస్యలున్నవారికే కాకుండా.. 18 ఏళ్లు దాటిన వయోజనులందరూ ఈ నెల 19 నుంచి టీకా వేస్తామని చెప్పారు. కరోనా విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని బైడెన్ పిలుపునిచ్చారు. వైరస్ పై పోరులో అమెరికా ఇంకా జీవన్మరణ పోరులోనే ఉన్నదని.. అనుకున్న లక్ష్యం కోసం అందరూ పాటుపడాలని ఆయన సూచించారు.

జులైలోగా అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని, ఆ లోపు ఎంతమందిని కాపాడుకుంటామనేదే ప్రధానాంశమని వెల్లడించారు. అప్పటిదాకా ప్రజలంతా మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటివి పాటించాలని తెలిపారు. బ్రెజిల్‌ను కబళిస్తున్న కరోనా లాటిన్ అమెరికా దేశం బ్రెజిల్‌ను కరోనా కబళిస్తున్నది. అక్కడ కొవిడ్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తున్నది. రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతుండటంతో శ్మశానాలు శవాల గుట్టల్లా మారాయి. బ్రెజిల్ లో కరోనా సోకి మంగళవారం ఒక్కరోజే 4,195 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో బ్రెజిల్ లో మరణాల సంఖ్య 3.37 లక్షలకు చేరింది. దేశంలో ఉన్న 90 శాతం పీయూసీలలో కొవిడ్ పేషెంట్లే చికిత్స పొందుతుండటం బ్రెజిల్ లో వైరస్ ఉధృతికి అద్దం పడుతున్నది.


Next Story

Most Viewed