‘పెళ్లి బరాత్‌’లో పీపీఈ కిట్‌ ధరించి తీన్మార్ డ్యాన్స్.. వీడియో వైరల్

by  |
‘పెళ్లి బరాత్‌’లో పీపీఈ కిట్‌ ధరించి తీన్మార్ డ్యాన్స్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతుండగా.. మరణాలు కూడా అదే స్థాయిలో సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంబులెన్స్‌లు విరామం లేకుండా పనిచేస్తున్నాయి. కరోనా రోగులను తరలించడంలో అంబులెన్స్‌ల డ్రైవర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. డాక్టర్లు, నర్సులతో సమానంగా వారు కూడా విధుల్లో విశ్రాంతి లేకుండా సేవలు అందిస్తున్నారు. అయితే, తన ఒత్తిడిని తగ్గించేకునేందుకు ఓ అంబులెన్స్ డ్రైవర్ పెళ్లి బరాత్‌లో పీపీఈ కిట్ ధరించి డ్యాన్స్ స్టెప్పులు వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌ హల్ద్వానీ పట్టణంలో ఓ కాలేజీ వద్ద పెళ్లి బరాత్‌ జరుగుతోంది. ఈ సమయంలో అటువైపు అంబులెన్స్‌లో వచ్చిన డ్రైవర్‌ మహేశ్‌ వాహనం పక్కన ఆపేశాడు. అనంతరం పీపీఈ కిట్‌లోనే బరాత్‌ మధ్యలోకి వచ్చి తీన్మార్‌ స్టెప్పులేశాడు. తన పని ఒత్తిడిని మరిచిపోయి కాసేపు ఆనందంతో డ్యాన్స్‌ చేశాడు. డ్రైవర్ పీపీఈ కిట్ ధరించి ఉండటంలో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కానీ, ఆ డ్రైవర్‌ ఆనందంతో డ్యాన్స్‌ చేస్తుండడంతో ఎవరూ అతడిని ఆపకుండా డ్యాన్స్ చేసేందుకు ఎంకరేజ్ చేశారు.

Next Story