జనవరి 18 నుంచి అంబేద్కర్ వర్సిటీ బీఈడీ పరీక్షలు

by Shyam |

<p>దిశ, తెలంగాణ బ్యూరో: డాక్టర్​బీఆర్​అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఈడీ ద్వితీయ సంవత్సరం పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 18వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఈ పరీక్షలు జనవరి 24వ తేదీన ముగుస్తాయన్నారు. ఫస్టియర్​పరీక్షలు 2022 జనవరి 27వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు [&hellip;]</p>

జనవరి 18 నుంచి అంబేద్కర్ వర్సిటీ బీఈడీ పరీక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: డాక్టర్​బీఆర్​అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఈడీ ద్వితీయ సంవత్సరం పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 18వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఈ పరీక్షలు జనవరి 24వ తేదీన ముగుస్తాయన్నారు. ఫస్టియర్​పరీక్షలు 2022 జనవరి 27వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు ఫీజును టీఎస్, ఏపీ ఆన్ లైన్ సెంటర్లు, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు. డిసెంబర్​23 నాటికి ఆన్ లైన్ రిజిస్ర్టేషన్ కు గడువు ఉందన్నారు. ఇతర వివరాలకు 040 23680241, 254 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని అధికారులు తెలిపారు.

Next Story