కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో.. ఢిల్లీకి బయలుదేరిన జ్ఞాన యుద్ధ యాత్ర..

by Shyam |

<p>దిశ, సికింద్రాబాద్: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఉస్మానియా విద్యార్థులు జ్ఞాన యుద్ద యాత్ర మొదలు పెట్టారు. ఈ సారి జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల లోపు ముద్రించాలని డిమాండ్ చేశారు. యాదాద్రి నుంచి ఢిల్లీకి కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జేరిపోతుల పరుశురామ్ చేపట్టిన జ్ఞాన యుద్ద యాత్ర ఆదివారం ఓయూ ఆర్ట్స్కళాశాలకు చేరుకుంది. అక్కడ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేశారు. తెలంగాణ రాష్ట్ర [&hellip;]</p>

కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో.. ఢిల్లీకి బయలుదేరిన జ్ఞాన యుద్ధ యాత్ర..
X

దిశ, సికింద్రాబాద్: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఉస్మానియా విద్యార్థులు జ్ఞాన యుద్ద యాత్ర మొదలు పెట్టారు. ఈ సారి జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల లోపు ముద్రించాలని డిమాండ్ చేశారు. యాదాద్రి నుంచి ఢిల్లీకి కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జేరిపోతుల పరుశురామ్ చేపట్టిన జ్ఞాన యుద్ద యాత్ర ఆదివారం ఓయూ ఆర్ట్స్కళాశాలకు చేరుకుంది.

అక్కడ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని, ముఖ ద్వారం వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనకై పల్లె నుండి ఢిల్లీ వరకు జ్ఞాన యుద్ధం యాత్ర చేస్తున్నామని జేరిపోతుల పరుశురామ్ అన్నారు.

Next Story