Amazon Prime "మాట్లాడొద్దు ప్లీజ్.. సమంతకు అమెజాన్ ప్రైమ్ ఆర్డర్

by  |
The Family Man
X

దిశ, సినిమా : అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ (The Family Man ) ఫ్రాంచైజ్‌కున్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో సీజన్ 2 ట్రైలర్ రిలీజ్ కాగా నార్త్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకున్నా.. తమిళుల నుంచి మాత్రం నిరసనలు వెల్లువెత్తాయి. ఈలం తమిళులు, తమిళనాడు ప్రజల మనోభావాలను కించపరిచేలా ఉందని సిరీస్‌ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఇదే విషయంపై తమిళనాడు సమాచార ప్రసార శాఖ మంత్రి మనో తంగరాజ్, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు లేఖ కూడా రాశారు. వెంటనే సిరీస్‌ ఓటీటీలో ప్రసారం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

కాగా ఈ సిరీస్‌లో సూసైడ్ బాంబర్‌గా కనిపించిన సమంత (Samantha Akkineni )క్యారెక్టర్‌పై వ్యతిరేకత వ్యక్తం అవుతుండగా.. ఈ విషయం గురించి మాట్లాడకూడదని ఆర్డర్ వేసింది అమెజాన్ ప్రైమ్(Amazon Prime). ట్రైలర్‌లో చూసిన క్లిపింగ్స్ ఆధారంగా తమిళులు ప్రొటెస్ట్ చేస్తున్న నేపథ్యంలో సిరీస్‌లో తన పాత్ర ఎలా ఉంటుంది? ఏం జరుగుతుంది? అనే దానిపై ఎక్కడా చర్చించరాదని తెలిపింది. సిరీస్ రిలీజ్‌కు ముందే కాంట్రవర్సీలకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్న ప్రైమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.



Next Story

Most Viewed