- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
స్టార్లతో నిండిన అమెజాన్ ప్రైమ్ సిరీస్.. డీటెయిల్స్
దిశ, సినిమా : బాలీవుడ్ నిర్మాత విక్రమ్ మల్హోత్రా మరో వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్‌గా మాధవన్ నటించిన ‘బ్రీత్’, అభిషేక్ బచ్చన్ స్టారింగ్ ‘బ్రీత్: ఇన్ టు ది షాడోస్’ సిరీస్‌లతో సూపర్ సక్సెస్ అందుకున్న ఆయన.. తనూజ చంద్ర డైరెక్షన్‌లో మరో అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ నిర్మించబోతున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ రైటర్ జూహీ చతుర్వేది కథ సిద్ధం చేయగా.. మల్టీస్టారర్ షోగా వస్తున్న సిరీస్‌లో జూహీ చావ్లా, సోహా అలీ ఖాన్, అయేషా జుల్కా, క్రితికా కమ్రా, కరిష్మా తన్నా, షహానా గోస్వామి లీడ్ రోల్స్‌లో కనిపించబోతున్నారు. థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న సిరీస్ స్క్రిప్ట్ బ్యూటిఫుల్‌గా రాశారని తెలుస్తుండగా.. స్టార్స్ అందరికీ కూడా ఇంపార్టెన్స్ ఉంటుందని సమాచారం. మార్చి నుంచి ఢిల్లీలో సిరీస్ చిత్రీకరణ జరగనుండగా.. ఫిబ్రవరి 8న ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో రీడింగ్ సెషన్‌కు స్టార్స్ అంతా హాజరయ్యారు.
తనూజ ప్రస్తుతం ఓ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉండగా.. ‘దుష్మన్, సంఘర్ష్’ లాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. ‘విక్కీ డోనార్, ‘మద్రాస్ కేఫ్, పీకు, గులాబో సితాబో చిత్రాలకు కథ అందించారు.