డిజిటల్ విభాగంలోకి 25 లక్షల ఎంఎస్ఎంఈలు

by  |
డిజిటల్ విభాగంలోకి 25 లక్షల ఎంఎస్ఎంఈలు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ గతేడాది తమ ప్లాట్‌ఫామ్‌లో మొత్తం 25 లక్షల ఎంఎస్ఎంఈలను డిజిటల్ విభాగంలోకి తీసుకొచ్చామని అమెజాన్ ఇండియా తెలిపింది. 2020-2025 మధ్య కోటి ఎంఎస్ఎంఈలను డిజిటలైజ్ చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని, దాదాపు రూ. 74 వేల కోట్లకు పైగా విలువైన ఎగుమతులను సాధించడం, 10 లక్షల అదనపు ఉద్యోగాలను కల్పించేందుకు రూ. 7 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్టు గతేడాది అమెజాన్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే.

అందులో భాగంగానే ప్రస్తుతం 25 లక్షల వరకు ఎంఎస్ఎంఈలను డిజిటలైజ్ చేసినట్టు అమెజాన్ గ్లోబల్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ వివరించారు. ‘ చిన్న, మధ్య తరహా వ్యాపారులతో కలిసి పనిచేయడం కొనసాగిస్తామని, కొత్త టూల్స్, టెక్నాలజీ వినియోగం, ఇన్నోవేషన్‌లను తీసుకొస్తాము. దీని ద్వారా భారతీయ వ్యాపారుల్లో వాణిజ్యంపై మరింత స్పష్టత వస్తుంది. ఎగుమతులను ప్రోత్సహించడం, భారీగా ఉద్యోగాలను కల్పించడం ద్వారా ఆత్మ నిర్భర భారత్ సాధనకు కృషి చేస్తాము. దేశీయంగా పురోగతిని సాధించేందుకు కీలంగా ఉండనున్నట్టు’ అమిత్ అగర్వాల్ అన్నారు.

ఇటీవల జీవనోపాధిని కాపాడుకోవడం, కొత్త ఉద్యోగాల సృష్టి సవాలుగా మరిందని, దీనికోసం అమెజాన్ దేశవ్యాప్తంగా ఐటీ, నైపుణ్యాభివృద్ధి, కంటెంట్ సృష్టి, రీటైల్, లాజిస్టిక్స్, ఉత్పత్తి రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించేందుకు సాయపడిందని అమెజాన్ తెలిపింది. 2013 నుంచి ఇప్పటివరకు దేశంలో 10 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల సృష్టికి అమెజాన్ తోడ్పాటునందించినట్టు వెల్లడించింది.


Next Story

Most Viewed