- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతి రూపు మారింది?
<p>రాజధాని అమరావతి రూపు మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన సీఆర్డీఏ బిల్లు రద్దు చేసిన నేపథ్యంలో.. రాజధానికి రైతుల నుంచి సేకరించిన భూమిలో 967,25 ఎకరాల భూమిని పేదలకు ఇళ్ల స్థలాలకు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆ భూమిని పేదల ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు వీలుగా మాస్టర్‌ప్లాన్ జోనింగ్ నిబంధనల్లో మార్పులు చేస్తూ పురపాలకశాఖ ముసాయిదా ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటనలో కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల్లోని భూముల […]</p>

రాజధాని అమరావతి రూపు మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన సీఆర్డీఏ బిల్లు రద్దు చేసిన నేపథ్యంలో.. రాజధానికి రైతుల నుంచి సేకరించిన భూమిలో 967,25 ఎకరాల భూమిని పేదలకు ఇళ్ల స్థలాలకు కేటాయించారు.
ఈ నేపథ్యంలో ఆ భూమిని పేదల ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు వీలుగా మాస్టర్‌ప్లాన్ జోనింగ్ నిబంధనల్లో మార్పులు చేస్తూ పురపాలకశాఖ ముసాయిదా ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటనలో కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల్లోని భూముల పరిధిలోకి వచ్చే 967.25 ఎకరాల్ని నివాస ప్రాంతంగా (రెసిడెన్షియల్ జోన్) మార్చినట్టు ప్రకటించింది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే 15 రోజుల్లోగా తెలియజేయాలని సూచించింది.
మరోవైపు రాజధాని రైతుల ఆందోళనలు 84వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో వెలగపూడి, పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, ఉండవల్లి, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డుల్లో ధర్నాలు, రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి.






