ఆలూ గోబీ మసాలా రెసిపీ

by  |
ఆలూ గోబీ మసాలా రెసిపీ
X

కావాల్సిన పదార్ధాలు:

బంగాళదుంపలు -3
గోబీ (క్యాలీఫ్లవర్) -అర కేజీ
ఉల్లిపాయలు -1
టమోటో -2
మెంతికూర -1 కట్ట
కొత్తిమీర -1 కట్ట
నూనె -2 టేబుల్ స్పూన్స్
జీలకర్ర -1 టీస్పూన్
పసుపు -1/2 టీస్పూన్
కారం -1 టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 టీస్పూన్
ధనియాల పొడి -1 టీస్పూన్
గరం మసాలా- 1/4 టీస్పూన్
జీడిపప్పు -10 పలుకులు
బిర్యానీ ఆకు -2
దాల్చిన చెక్క -కొద్దిగా
నీళ్లు -ఒక కప్పు
ఉప్పు -రుచికి తగినంత

తయారీ విధానం:

ఒక బాణీలో నూనె వేడి చేసి అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ను వేగించుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమోటో ముక్కలు వేసుకోవాలి. రెండు నిమిషాలు తర్వాత జీడిపప్పు వేసి వేగించుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మొత్తటి పేస్టులా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మరో పాన్‌లో నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసుకోవాలి. కొద్దిగా వేగాక దానిలో పసుపు, కారం వేసి సన్నని మంటపై వేగించుకోవాలి. దానిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ-టమోటో పేస్ట్‌ను వేసి కలుపుకుని ధనియాల పొడి, ఉప్పు వేసుకోవాలి. ఈ మిశ్రమంలో బంగాళదుంపల ముక్కలు వేసి నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత గోబీ ముక్కలను వేసి సన్నని మంటపై 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కొద్దిగా చిక్కబడిన తర్వాత మెంతి ఆకులు, గరం మసాలా, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. రెండు నిమిషాల తర్వాత దింపేసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడి ఆలు గోబీ మసాలా రెడీ..


Next Story

Most Viewed