ఆగలేక పోతున్న ‘అల్లుడు’.. ముందుగా రానున్నాడా?

by  |
ఆగలేక పోతున్న ‘అల్లుడు’.. ముందుగా రానున్నాడా?
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ లేటెస్ట్ మూవీ ‘అల్లుడు అదుర్స్’ సంక్రాంతి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అదుర్స్ అనిపించే ఎంటర్టైన్మెంట్‌తో జనవరి 15న థియేటర్స్‌లోకి వచ్చేస్తున్నట్లు ఇప్పటికే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రాగా.. ఒక్కరోజు ముందుగానే అంటే జనవరి 14నే చిత్రం విడుదల అవుతుందని సమాచారం. మాస్ మహారాజ రవితేజ ‘క్రాక్’ జనవరి 9న రిలీజ్ అవుతుంది. అంటే పండుగకు ఐదు రోజుల ముందుగానే వచ్చి కలెక్షన్స్ రాబడుతుంది. ఇక జనవరి 14న రామ్ పోతినేని ‘రెడ్’ సినిమా ఒక్కటే విడుదలకు సిద్ధంగా ఉండటంతో.. ‘అల్లుడు అదుర్స్‌’ను కూడా అదే రోజు బరిలో దించేందుకు ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఒక్కరోజు లేట్‌గా రిలీజైతే కలెక్షన్స్ చేజారిపోతాయేమోననే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.



Next Story