- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి వార్తలపై స్పందించిన అల్లు శిరీష్
<p>దిశ, వెబ్‌డెస్క్: నిహారిక పెళ్లి తర్వాత మెగా ఫ్యామిలీలో త్వరలోనే మరో పెళ్లి జరగనుందన్న వార్త.. మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వివాహం మరెవరిదో కాదు అల్లు శిరీష్‌దే అని కూడా ప్రచారం జరిగింది. ఇందుకు కారణం సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. శిరీష్ తన కంటే పెద్దవాడని.. తన కన్నా ముందు అతని పెళ్లి జరుగుతుందని.. అది కూడా వచ్చే ఏడాది కన్ఫార్మ్ అని తేజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో శిరీష్ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: నిహారిక పెళ్లి తర్వాత మెగా ఫ్యామిలీలో త్వరలోనే మరో పెళ్లి జరగనుందన్న వార్త.. మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వివాహం మరెవరిదో కాదు అల్లు శిరీష్‌దే అని కూడా ప్రచారం జరిగింది. ఇందుకు కారణం సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. శిరీష్ తన కంటే పెద్దవాడని.. తన కన్నా ముందు అతని పెళ్లి జరుగుతుందని.. అది కూడా వచ్చే ఏడాది కన్ఫార్మ్ అని తేజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో శిరీష్ పెళ్లి వార్త మీడియాలో స్ప్రెడ్ అయిపోయింది. ఈ రూమర్స్ రోజురోజుకూ పెరుగుతుండటంతో దీనిపై అల్లు శిరీష్ స్పందించారు. ‘హహహ.. నా పెళ్లిపై తేజ్ జోక్ చేసి ఉంటాడు, కానీ మీరు మాత్రం సీరియస్‌గా తీసుకున్నారు. నేను సింగిల్‌గా, చిల్‌గా ఉండటం పేరెంట్స్‌కు కూడా ఓకే.. వారి నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు’ అంటూ రూమర్స్‌కు చెక్ పెట్టాడు. అంతేకాదు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నప్పుడు మీకు తప్పకుండా చెప్తానని శిరీష్ తెలిపాడు.






