అయాన్ రిక్వెస్ట్‌కు టైగర్ ఫిదా

by  |
అయాన్ రిక్వెస్ట్‌కు టైగర్ ఫిదా
X

దిశ, వెబ్‌డెస్క్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అయాన్ బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌ను కలవాలని అనుకుంటున్నాడు. బాఘీ, బాఘీ -2 సినిమాలతో టైగర్‌కు వీరాభిమాని అయిపోయిన అయాన్… తన అభిమాన హీరోని కలవాలని కోరుతున్నాడన్న విషయాన్ని బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ వీడియోలో అయాన్ .. టైగర్ స్క్వాష్ నన్ను బాఘీ -3 షూటింగ్‌కు తీసుకెళ్లాలని కోరాడు. ఎందుకు అని బన్నీ ప్రశ్నిస్తే .. గన్ ఫైటింగ్ చేస్తున్న టైగర్ బాడీ అంటే తనకు ఇష్టమని చెప్పాడు. ఈ క్యూట్ వీడియోకు మురిసిపోయిన టైగర్… వెంటనే తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో షేర్ చేశాడు. నా కొత్త పేరు టైగర్ స్క్వాష్ చాలా నచ్చిందని… బన్నీ సార్ ఒక్క బాఘీ -3 షూటింగ్ మాత్రమే కాదు.. నా అన్ని సినిమా సెట్స్‌కు అయాన్‌ను తీసుకెళ్తానని చెప్పండి అన్నాడు టైగర్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Tags : Allu Arjun, Allu Ayaan, Tiger Shroff, Fan Moment


Next Story