‘ఉప్పెన’ ఒక ఆణిముత్యం.. స్టైలిష్ స్టార్ ప్రశంసలు

by  |
Uppena team, Allu Arjun
X

దిశ, సినిమా: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ఉప్పెన’ మూవీ యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇన్నాళ్లు ‘పుష్ప’ షూటింగ్‌లో బిజీగా ఉన్న బన్ని.. తాజాగా ‘ఉప్పెన’ నిర్మాతలు రామానాయుడు స్టూడియోస్‌లో వేసిన స్పెషల్ షోను వీక్షించి యూనిట్‌కు అభినందనలు తెలిపారు. తొలి సినిమాతోనే అమేజింగ్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చిన హీరో వైష్ణవ్ తేజ్‌‌కు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చిన ఆయన.. ఫస్ట్ అటెంప్ట్ బ్లాక్ బస్టర్ కావడం సంతోషంగా ఉందన్నారు. హీరోయిన్ కృతి శెట్టి, విజయ్ సేతుపతి నటన అద్భుతంగా ఉందని, దర్శకుడు బుచ్చిబాబు పనితీరు ఇతర టెక్నీషియన్లకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇక ‘ఉప్పెన’ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ను బన్నీ పొగడ్తలతో ముంచెత్తారు. రిస్క్ ఉందని తెలిసినా ధైర్యంతో సినిమాను నిర్మించేందుకు ముందుకు రావడం, కొత్తగా వచ్చిన వారిని ఎంకరేజ్ చేయడంపై అభినందనలు తెలిపారు. ‘ఉప్పెన’ లాంటి ఆణిముత్యాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న ‘పుష్ప’ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా.. సుకుమార్ దర్శకులు.

Allu Arjun, Vaishnav Tej


Next Story

Most Viewed