కొరటాల డైరెక్షన్‌లో బన్నీ పాన్ ఇండియా ఫిల్మ్

by  |
కొరటాల డైరెక్షన్‌లో బన్నీ పాన్ ఇండియా ఫిల్మ్
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. చాలా గ్యాప్ తీసుకుని మరీ ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ నాన్ బాహుబలి రికార్డులు కొల్లగొట్టిన బన్నీ.. ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో ‘పుష్ప’ మూవీ ప్రకటించాడు. ఐదు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ అదిరిపోగా.. కరోనా కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే ఈ గ్యాప్‌లో డైరెక్టర్ కొరటాల శివతో బన్నీ టచ్‌లో ఉన్నాడు. మొత్తానికి లాక్‌డౌన్‌ టైమ్‌లో కొరటాల కథ మెచ్చిన బన్నీ.. తన 21వ చిత్రంగా అధికారిక ప్రకటన చేశాడు.

కొరటాల కాంబినేషన్‌లో పాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్న బన్నీ.. సినిమా అఫిషియల్ అనౌన్స్‌మెంట్ చేసేందుకు కొంత కాలంగా నిశబ్దంగా వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు. గీతా ఆర్ట్స్ సమర్పణలో యువసుధా ఆర్ట్స్‌పై సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. కాగా యువ సుధ బ్యానర్‌కు ఇదే తొలి చిత్రం కాగా.. ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు బన్నీ.

కాగా కొరటాల ఆచార్య సినిమా, బన్నీ పుష్ప పూర్తయ్యాక.. షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాను 2022 ఆరంభంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్.



Next Story