సీతకు వెల్‌కమ్.. ‘ఆర్ఆర్ఆర్‌’కు హెచ్చరికలు

by  |
సీతకు వెల్‌కమ్.. ‘ఆర్ఆర్ఆర్‌’కు హెచ్చరికలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ పడింది. ‘ఆర్ఆర్ఆర్‌’ సెట్స్‌లో సీత అడుగుపెట్టింది. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌లో జాయిన్ అయింది. డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళితో పాటు మూవీ యూనిట్ తనకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పగా, ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అలియా భట్ పేరు ట్విట్టర్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్‌’లో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటిస్తుండగా, రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఆలియా ‘ఆర్ఆర్ఆర్’ సెట్స్‌లో అడుగుపెట్టడంపై సుశాంత్ ఫ్యాన్స్, నెపోటిజాన్ని ఖండించే నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆలియా ఏ సినిమా చేసినా, ఎవరు పని ఇప్పించినా సరే.. ఫలితం మాత్రం డిజాస్టరే అని హెచ్చరిస్తున్నారు. ‘బాయ్‌కాట్ ఆలియా భట్’ అంటూ ట్విట్టర్ ట్రెండ్‌కు తెరలేపిన వర్గం.. హిస్టారికల్ డిజాస్టర్‌‌గా మిగిలిపోతుందని ‘ఆర్ఆర్ఆర్‌’కు వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడే తనను ప్రాజెక్ట్ నుంచి తొలగిస్తే మంచిదని సూచిస్తున్నారు.



Next Story

Most Viewed