‘వకీల్ సాబ్’ కోసమే ఆలియా భట్ తెలుగు నేర్చుకుందేమో!

62

దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ కరోనా టైమ్‌లో తెలుగు పాఠాలు బాగానే నేర్చుకుంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం తెలుగుపై అవగాహన పెంచుకున్న ఆలియా.. ‘వకీల్ సాబ్’కు తెలుగులో శుభాకాంక్షలు తెలుపుతూ రిలీజ్ చేసిన వీడియో వైరల్ అయింది.

‘అందరికీ నమస్కారం’ అంటూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ‘గంగుబాయి కతియావాడి’ యాక్ట్రెస్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పాటు టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఫ్యాన్స్ బి రెడీ.. ‘వకీల్ సాబ్’ వచ్చేస్తున్నాడు అంటూ అభిమానులను అలర్ట్ చేసింది. మొత్తానికి ఈ వీడియో ద్వారా పవన్ ఫ్యాన్స్‌కు కూడా ఆలియా ఫేవరెట్ అయిపోతుందంటున్న విశ్లేషకులు.. టాలీవుడ్ ఎంట్రీకి ముందే ఈ వీడియో చేసి మంచి పని చేసిందని అభిప్రాయపడుతున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..