నిర్మాతగా మారిన కామతిపుర రాణి ‘గంగుబాయి’

by  |
నిర్మాతగా మారిన కామతిపుర రాణి ‘గంగుబాయి’
X

దిశ, సినిమా : బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ ఆలియా భట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. ఆమె లీడ్ రోల్‌లో నటించిన ‘గంగుబాయి కతియావాడి’ టీజర్ ఇటీవలే రిలీజై రికార్డ్ వ్యూస్ కొల్లగొడుతుండగా.. కామతిపుర రాణిగా గంగుబాయి పాత్రలో ఆలియా జీవించిందన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పాన్ ఇండియా లెవెల్‌లో రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR, రణ్‌బీర్ ‘బ్రహ్మాస్త్ర’తో పాటు శరన్ శర్మ డైరెక్షన్‌లోనూ ఓ మూవీలో నటిస్తున్న ఆలియా, తాజాగా ఓన్ ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసింది. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేసింది. సంతోషకరమైన, నిజమైన, కలకాలం నిలిచిపోయే కథలను తన ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్ హౌజ్(Eternal Sunshine Production) ద్వారా తెరమీదకు తీసుకురాబోతున్నట్లు పేర్కొంది. కాగా నిర్మాతగా మారిన ఆలియాకు ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కరణ్ జోహర్, జోయా అక్తర్, రితేశ్ దేశ్‌ముఖ్ తదితరులు ఆల్ ది బెస్ట్ చెప్పారు.



Next Story

Most Viewed