రణ్‌బీర్‌ను మిస్సవుతున్న ఆలియా.. పిక్ వైరల్

by  |
Aliya Bhatt
X

దిశ, సినిమా: బాలీవుడ్ ప్లే బాయ్ రణ్‌బీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో వారం రోజుల నుంచి హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. బ్రహ్మాస్త్ర మూవీ షూటింగ్‌ టైమ్‌లోనే రణ్‌బీర్ కరోనా బారిన పడగా, అతడి కోస్టార్ అండ్ గర్ల్ ఫ్రెండ్ ఆలియా భట్ తనను చాలా మిస్ అవుతోందట. ఈ క్రమంలో సోమవారం పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్న ఈ భామ.. రణ్‌బీర్‌ను ఎంతలా మిస్ అవుతున్నదో వ్యక్తపరుస్తూ భావోద్వేగంతో కూడిన స్పెషల్ పిక్‌ను పోస్ట్ చేసింది. రణ్‌బీర్, ఆలియా పక్కపక్కనే కూర్చుని చేతిలో చెయ్యేసుకున్న ఫొటోను ఇన్‌స్టా హ్యాండిల్‌లో షేర్ చేస్తూ ‘మేజర్ మిస్సింగ్’ అనే క్యాప్షన్‌తో పాటు హార్ట్ ఎమోటికాన్‌ను యాడ్ చేసింది. కాగా ఈ పిక్చర్‌ను చూసిన వీరిద్దరి ఫ్యాన్స్‌తో పాటు ఫ్రెండ్స్‌ కూడా క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా గురువారం సాయంత్రం ఆలియా ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్‌ అయాన్ ముఖర్జీతో కలిసి ముక్తేశ్వర స్వామి టెంపుల్‌కు వెళ్లింది. అయితే ఈ ఫ్రేమ్‌లో రణ్‌బీర్‌ను లేకపోవడాన్ని ఫ్యాన్స్ కూడా మిస్సవుతున్నారు. ఇక బాలీవుడ్ బడా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో అమితాబ్, అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story

Most Viewed