‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం ఆలియా డేట్స్ ఎన్నాళ్లు?

by  |
‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం ఆలియా డేట్స్ ఎన్నాళ్లు?
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. తారక్, చరణ్ మల్టీస్టారర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ భామ ఆలియా భట్ ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. చెర్రీ, తారక్‌లకు సరిసమానంగా నిలిచే పాత్రకు ఆలియా భట్ అయితేనే న్యాయం చేయగలదని తనను ఎన్నుకున్నారు జక్కన్న. కానీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడగా.. ఆలియాకు సంబందించిన ఒక్క సీన్ కూడా చిత్రీకరించలేదు. అప్పుడో.. ఇప్పుడో అంటూనే టైమ్ గడిచిపోగా.. నవంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ కానుందని టాలీవుడ్ టాక్.

కాగా, ఈ చిత్రం కోసం ఆలియా నవంబర్, డిసెంబర్ మొత్తం కేటాయించిందని సమాచారం. ఈ రెండు నెలల్లో తనకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయ్యేలా చూడాలని జక్కన్నను కోరిందని, కాబట్టి ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ ఆలియా భట్ సీన్స్‌తోనే స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. పైగా జక్కన్న ఇప్పటికే ఔట్‌డోర్ షూటింగ్ ప్లేసెస్ ఫైనల్ చేసి రెడీగా ఉన్నారు కూడా.

మరోవైపు తారక్, చరణ్‌ల పార్ట్ పూర్తయితే వాళ్లతో సినిమా చేసేందుకు దర్శకులు వెయిట్ చేస్తుండగా.. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఫస్ట్ గ్లింప్స్ కోసం ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. ‘భీమ్ ఫర్ రామరాజు’తో చెర్రీ అభిమానులను శాటిస్‌ఫై చేసిన జక్కన్న.. నందమూరి ఫ్యాన్స్‌కు ఆ ట్రీట్ ఎప్పుడు రెడీ చేస్తారో చూడాలి.


Next Story

Most Viewed