బాహుబలికి జోడీగా ‘రామరాజు హీరోయిన్’

by  |
బాహుబలికి జోడీగా ‘రామరాజు హీరోయిన్’
X

‘సావిత్రి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు నాగ్ అశ్విన్. సావిత్రమ్మ జీవితాన్ని ఆయన తెరపై ఆవిష్కరించిన విధానం.. సగటు ప్రేక్షకుడితోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్.. ప్రభాస్ కాంబినేషన్‌లో పాన్ ఇండియా మూవీ పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నిర్మించనున్న ఈ సినిమాకు.. అనౌన్స్‌మెంట్‌తోనే భారీ క్రేజ్ ఏర్పడింది. కాగా ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నటింపజేసేందుకు దర్శక నిర్మాతలు బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ అలియా భట్‌ను సంప్రదించినట్లు సమాచారం. కథలో తన పాత్రకు అధిక ప్రాధాన్యత ఉండటంతో.. అలియా ఈ ప్రాజెక్ట్‌కు దాదాపు ఓకే చెప్పినట్లు సమాచారం. పైగా బాహుబలితో సినిమా కాబట్టి వెనుకడుగు వేసే ఛాన్సే లేదు.

కాగా జక్కన్న దర్శకత్వంలో వస్తున్న ‘రౌద్రం రుధిరం రణం’ సినిమా ద్వారా సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న ఈ భామ.. రామరాజు, భీమ్‌లకు నటనాపరంగా, పాత్ర పరంగా తగిన పోటీ ఇచ్చే సీత పాత్రలో కనిపించనుంది. కాగా ఈ పాత్ర కోసం అలియాను ఎందుకు ఎన్నుకున్నారని ప్రశ్నిస్తే.. తన నటనా ప్రతిభ గురించి జక్కన్న ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed