వాట్సాప్​ వాడుతున్నారా..? బహుపరాక్

by  |
వాట్సాప్​ వాడుతున్నారా..? బహుపరాక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇప్పటి దాకా ఫేస్​బుక్​ మెస్సెంజర్​ ద్వారా అపరిచితులు కూడా డబ్బులు అడిగిన సంఘటనలు అనేకం. కానీ ఇప్పుడు వాట్సాప్​లోని కాంటాక్ట్​ నెంబర్లకు పర్సనల్​ మెస్సేజ్​లు పంపిస్తున్నారు. తమకు తెలిసిన నెంబర్​ నుంచి డబ్బులు అడుగడంతో కాదనలేక ట్రాన్స్​ఫర్​ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా మోసాలు బయటకు వస్తున్నాయి.

వాట్సాప్‌ హ్యాక్‌ చేసి…

వాట్సాప్‌కు ఫ్రెండ్స్‌ పేరుతో లింక్స్‌ పంపిస్తున్నారు. వాటిని క్లిక్‌ చేస్తే ఇక మన సమాచారం మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తోంది. తాజాగా సైబర్‌క్రైమ్స్‌ పోలీసులకు ఇలాంటి ఫిర్యాదులు నమోదవుతున్నాయి. ఇటీవల ఓ సంస్థ ఎండీ వాట్సాప్‌ నెంబర్‌ నుంచి సంస్థ ఉద్యోగుల వాట్సాప్‌ నెంబర్లకు ఇలాంటి మెసేజ్‌ వెళ్లింది. తనకు అర్జెంట్‌గా డబ్బులు కావాలని, ఎంతుంటే అంత వెంటనే తన అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయాలంటూ సమాచారం పంపించారు. తన సెల్​ఫోన్​లోకి కాంటాక్ట్​ నెంబర్లకు పర్సనల్​ మెస్సేజ్​ వెళ్లింది. అయితే దీనిపై సదరు ఉద్యోగులు ఎండీకి సమాచారం ఇవ్వగా.. వాట్సాప్​ అకౌంట్​ హ్యాక్​ అయినట్లు తేలింది. బుధవారం కూడా సైబర్​ క్రైం పోలీసులకు ఇలాంటి ఫిర్యాదులు అందాయి. షేక్‌పేట్‌కు చెందిన ఓ యువతి సోదరుడు సౌదీలో ఉండగా.. అతడి వాట్సాప్‌ నుంచి రెండు రోజుల క్రితం అర్జెంట్‌గా డబ్బులు కావాలని, అకౌంట్‌ నెంబర్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని మెసేజ్‌ వచ్చింది. దీంతో సదరు యువతి వెంటనే రూ.లక్షన్నర పంపింది. అనంతరం సోదరుడికి ఫోన్‌ చేసి డబ్బులు వచ్చాయా అని అడగడంతో, ఆ మెసేజ్‌ అతడు పంపలేదని తేలింది. దీంతో ఆమె మెసేజ్‌ను సోదరుడికి పంపించింది. దీనిపై వారు మరింత లోతుగా పరిశీలించగా.. అతడి నెంబర్‌ హ్యాక్‌ అయిందని గుర్తించారు. మారేడుపల్లిలో కూడా ఇలాంటి కేసు నమోదైంది.

ఇప్పుడు వాట్సాప్​తోనూ జాగ్రత్త

ఇప్పటిదాకా ఫేస్​బుక్​కే పరిమితమైన ఈ హ్యాకింగ్​.. ఇప్పుడు వాట్సాప్​లోకి చేరింది. వాట్సాప్​ నుంచి సదరు వ్యక్తి పర్సనల్​గా పంపితేనే మెస్సేజ్​ వెళ్తుంది. కానీ ఇప్పుడు ఫ్రెండ్స్​ పేరుతో వచ్చే లింక్​లను ఓపెన్​ చేస్తే.. మన రహస్య సమాచారం మొత్తం హ్యాకర్లకు వెళ్తోంది. దీంతో కాంటాక్ట్​ నెంబర్లకు మనీ అర్జంట్​ అంటూ సమాచారం పంపిస్తున్నారు. ఇవి పర్సనల్​గా వస్తుండటంతో.. కొంతమంది డబ్బులను పంపిస్తున్నారు. ఇక నుంచి వాట్సాప్​ వినియోగదారులు కూడా బహుపరాక్​.

Next Story

Most Viewed