- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం సేవించిన గేదె.. మత్తులో ఏం చేసిందంటే ?
<p>దిశ, వెబ్‌డెస్క్ : మద్యానికి ఉన్న డిమాండ్ దేనికి ఉండదు. చాలా మంది మద్యానికి బానిసలవుతుంటారు. అయితే ఈ మద్యం అనేది మనుషులు తాగడం సహజం కానీ పశువులు కూడా ఈ మధ్య కాలంలో మద్యం సేవిస్తున్నాయి. పశువులు మద్యం సేవిచడం ఏంటీ అనేగా మీ ఆలోచన..? అవునూ గుజరాత్‌లో ఓ గేదె మద్యం సేవించింది. అంతటితో ఆగకుండా వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టింది. అంతే కాకుండా ఆటూ, ఇటూ ఉరకడం, నోటిలోంచి నురగ కక్కడం మొదలు […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : మద్యానికి ఉన్న డిమాండ్ దేనికి ఉండదు. చాలా మంది మద్యానికి బానిసలవుతుంటారు. అయితే ఈ మద్యం అనేది మనుషులు తాగడం సహజం కానీ పశువులు కూడా ఈ మధ్య కాలంలో మద్యం సేవిస్తున్నాయి. పశువులు మద్యం సేవిచడం ఏంటీ అనేగా మీ ఆలోచన..? అవునూ గుజరాత్‌లో ఓ గేదె మద్యం సేవించింది. అంతటితో ఆగకుండా వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టింది. అంతే కాకుండా ఆటూ, ఇటూ ఉరకడం, నోటిలోంచి నురగ కక్కడం మొదలు పెట్టింది. దీంతో గేదె ప్రవర్తనను చూసి ఆందోళన చెందిన యజమాని పశు వైద్యున్ని రప్పించి గేదెను చూపించాడు. పశువును పరిశీలించిన వైద్యుడు గేదె తాగిని నీటిలో మద్యం కలిసినట్టుగా తెలిపాడు.
దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పశువు యజమాని తన స్నేహితులు అక్రమంగా తెచ్చుకున్న మద్యాన్ని పశువులు నీళ్లు తాగే తొట్టిలో దాచిపెట్టారు. అందులో ఉన్న సీసా పగిలి గేదె తాగే నీటిలో మద్యం కలిసింది ఆ నీరు తాగిన గేదె అస్వస్థకు గురైంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పశుశాలపై రైడ్ చేసి రూ.32,000 విలువైన వంద మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నారు.






