- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ సరిహద్దు వద్ద భారీగా మద్యం సీజ్
<p>దిశ, కోదాడ: మండల పరిధిలోని రామాపురం చెక్‌పోస్టు వద్ద సోమవారం అర్ధరాత్రి మద్యం పట్టుబడింది. సీఐ శివరాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉండటంతో గత కొంతకాలంగా విజయవాడకు చెందిన ముగ్గురు వ్యక్తులు సూర్యాపేట పట్టణంలోని ఓ మద్యం దుకాణంలో మద్యాన్ని కొనుగోలు చేసి ఏపీకి తరలిస్తున్నారు. సోమవారం రాత్రి రూ.7 లక్షల మద్యం కొనుగోలు చేసి ఐసీఎల్ కొరియర్ డీసీఎం వ్యాన్‌లో తరలిస్తుండగా రామాపురం చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ […]</p>

దిశ, కోదాడ: మండల పరిధిలోని రామాపురం చెక్‌పోస్టు వద్ద సోమవారం అర్ధరాత్రి మద్యం పట్టుబడింది. సీఐ శివరాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉండటంతో గత కొంతకాలంగా విజయవాడకు చెందిన ముగ్గురు వ్యక్తులు సూర్యాపేట పట్టణంలోని ఓ మద్యం దుకాణంలో మద్యాన్ని కొనుగోలు చేసి ఏపీకి తరలిస్తున్నారు. సోమవారం రాత్రి రూ.7 లక్షల మద్యం కొనుగోలు చేసి ఐసీఎల్ కొరియర్ డీసీఎం వ్యాన్‌లో తరలిస్తుండగా రామాపురం చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ చేయడంతో అక్రమ మద్యం పట్టుబడింది. తెలంగాణలో మద్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి విజయవాడలో అధిక ధరలకు విక్రయించాలనే ఉద్దేశంతో మద్యం తరలిస్తున్నట్లు నిందితులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని డీసీఎం వ్యాన్ సీజ్ చేశారు. మద్యం కొనుగోలు చేసిన దుకాణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివరామిరెడ్డి తెలిపారు.






