- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మందుబాబులకు అడ్డాగా జూనియర్ కాలేజీ.. అడిగేవారు లేరని అరాచకం..!
by Batti.Sumithra |
<p>దిశ, వాజేడు: సరస్వతి నిలయంలో మందు బాబులు చిందులేస్తున్నారు. రాత్రి అయితే చాలు మందు బాటిళ్లు, సోడా, స్టఫ్‌ను కాలేజీలోకి తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ అరాచక ఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలోని జూనియర్ కళాశాలలో వెలుచూసింది. దసరా పండుగ పర్వదినం కావడంతో జూనియర్ కళాశాల ఆవరణలో రాత్రివేళల్లో మందుబాబులు అడ్డాగా మార్చుకుంటున్నారు. నిత్యం మందు తాగుతూ కళాశాల ప్రాంగణంలో విచ్చలవిడిగా సీసాలు విసిరేస్తున్నారు. ఉదయం ఇది గమనించిన ప్రజలు కళాశాల ఆవరణను బార్‌గా మార్చారంటూ […]</p>

X
దిశ, వాజేడు: సరస్వతి నిలయంలో మందు బాబులు చిందులేస్తున్నారు. రాత్రి అయితే చాలు మందు బాటిళ్లు, సోడా, స్టఫ్‌ను కాలేజీలోకి తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ అరాచక ఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలోని జూనియర్ కళాశాలలో వెలుచూసింది. దసరా పండుగ పర్వదినం కావడంతో జూనియర్ కళాశాల ఆవరణలో రాత్రివేళల్లో మందుబాబులు అడ్డాగా మార్చుకుంటున్నారు. నిత్యం మందు తాగుతూ కళాశాల ప్రాంగణంలో విచ్చలవిడిగా సీసాలు విసిరేస్తున్నారు. ఉదయం ఇది గమనించిన ప్రజలు కళాశాల ఆవరణను బార్‌గా మార్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో కళాశాలలో కనీస భద్రత కల్పించకపోవడంతోనే మందుబాబులు రెచ్చిపోతున్నారని చెబుతున్నారు. ఇకనైనా విద్యాలయంలో సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story






