రికార్డుల వేటలో బన్నీ పాటలు

by  |
రికార్డుల వేటలో బన్నీ పాటలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘అల వైకుంఠపురంలో’ సినిమా ఏ శుభ ముహూర్తాన ప్రారంభమైందో తెలియదు కానీ, రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉంది. స్టైలిష్ స్టార్ బన్నీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా నాన్ బాహుబలి రికార్డులు కొల్లగొట్టగా.. ఈ సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ సౌత్ ఇండియన్ హిస్టరీలోనే రికార్డులు క్రియేట్ చేస్తోంది. సూపర్ పాపులర్ అయిన బుట్టబొమ్మ సాంగ్‌కు దేశ, విదేశాల్లో ఫ్యాన్స్ ఉండగా.. సెలెబ్రిటీలు కూడా ఈ పాటకు స్టెప్స్ వేసిన సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్‌గా ఈ సాంగ్ యూట్యూబ్‌లో 450 మిలియన్ వ్యూస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేయడం విశేషం. ఈ రికార్డ్ క్రియేట్ అయి కొన్ని గంటలు కూడా గడవక ముందే, ఇదే సినిమాలోని మరో పాట ‘రాములో రాములా’ క్రేజ్‌కు మరో రికార్డ్ కూడా సెట్ అయింది.

‘రాములో రాముల’ సాంగ్ లిరికల్ అండ్ ఫుల్ వీడియో సాంగ్ రెండు కూడా 250 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్నాయి. ఇలాంటి ఫీట్ సాధించిన పాట సౌత్ ఇండస్ట్రీలో ఇదే కాగా, హీరో బన్నీకే ఈ అరుదైన ఘనత దక్కింది. కాగా దీనిపై ట్వీట్ చేసిన థమన్.. బన్నీ, త్రివిక్రమ్‌కు థాంక్స్ చెప్పాడు.


Next Story

Most Viewed