- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అల వైకుంఠపురంలో’.. మరో రికార్డ్!
<p>దిశ, వెబ్‌డెస్క్: అల వైకుంఠపురంలో సినిమా అలా రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వెళ్తోంది. సంక్రాంతికి రిలీజై టాలీవుడ్‌లో నాన్ బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసిన మూవీ.. బుట్ట బొమ్మ సాంగ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా ఆల్బమ్‌లోని ప్రతీ సాంగ్ కూడా సూపర్ హిట్ కాగా.. చిత్రానికి ఫిదా అయిపోయానని.. హీరో అల్లు అర్జున్‌తో కలిసి సినిమా చేయాలనుందని బాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్ కూడా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ప్రేక్షకులకు ఫుల్ లెంగ్త్ […]</p>

దిశ, వెబ్‌డెస్క్:
అల వైకుంఠపురంలో సినిమా అలా రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వెళ్తోంది. సంక్రాంతికి రిలీజై టాలీవుడ్‌లో నాన్ బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసిన మూవీ.. బుట్ట బొమ్మ సాంగ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా ఆల్బమ్‌లోని ప్రతీ సాంగ్ కూడా సూపర్ హిట్ కాగా.. చిత్రానికి ఫిదా అయిపోయానని.. హీరో అల్లు అర్జున్‌తో కలిసి సినిమా చేయాలనుందని బాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్ కూడా కాంప్లిమెంట్స్ ఇచ్చారు.
ప్రేక్షకులకు ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్మెంట్ అందించిన ఈ చిత్రం ఇప్పుడు మరో రికార్డ్ క్రియేట్ చేసింది. బాహుబలి రికార్డులను కూడా బద్ధలు కొడుతూ.. టీవీలో అత్యధిక రేటింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని జెమిని టీవీలో ప్రసారమైన చిత్రం, ఇంతకు ముందు ఏ తెలుగు సినిమా సాధించని టీఆర్పీ రేటింగ్స్ సంపాదించింది. 29.4 టీఆర్పీ రేటింగ్స్ సాధించి అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమాను నిర్మించిన గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు స్పెషల్ ట్వీట్ చేశాయి.
సినిమా థియేటర్‌లో విడుదలై ఏడు నెలలు, ఓటీటీలో రిలీజై ఆరు నెలలు అవుతున్నా సరే.. రికార్డ్ బ్రేకింగ్ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ సాధించిందని ఆనందం వ్యక్తం చేశాయి. ఇంత గొప్ప రెస్పాన్స్, లవ్ అందించిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పాయి.
It has been 7 months post Theatrical release and 6 months post OTT release. Still #AVPL managed to set a RECORD BREAKING-HIGHEST TRP – 29.4 for any Telugu Film ever. Thank you for such a phenomenal response & love. 🙏😍🕺#AVPLAllTimeRecordTRP @alluarjun #Trivikram @hegdepooja pic.twitter.com/dvfuKPdtOQ
— Geetha Arts (@GeethaArts) August 27, 2020






