చేతులెత్తి మొక్కుతున్నా… బయటకు రావొద్దు : అక్షయ్

by Shyam |   (  Updated:2020-03-24 08:14:16  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి చెందుతుంది &#8230; ఇళ్లకు పరిమితమై ప్రాణాలు కాపాడుకోమని ప్రభుత్వం మొత్తుకుంటుంటే అర్ధమవ్వట్లేదా అని ప్రశ్నించారు. లాక్ డౌన్ ప్రకటించినప్పుడు ఇంట్లో ఉండండి&#8230; కుటుంబ సభ్యులతో కలిసి ఉండండి&#8230; అంతేకాని రోడ్లమీదకొచ్చి ఇబ్బందులు కలిగించే ప్రయత్నం మాత్రం చేయొద్దని చేతులు జోడించి వేడుకున్నారు. ఇదేమైనా జోక్ అనుకుంటున్నారా? &#8230; ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో ఉంది. మీరు జాగ్రత్తగా ఉండకపోతే&#8230; [&hellip;]</p>

చేతులెత్తి మొక్కుతున్నా… బయటకు రావొద్దు : అక్షయ్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి చెందుతుంది … ఇళ్లకు పరిమితమై ప్రాణాలు కాపాడుకోమని ప్రభుత్వం మొత్తుకుంటుంటే అర్ధమవ్వట్లేదా అని ప్రశ్నించారు. లాక్ డౌన్ ప్రకటించినప్పుడు ఇంట్లో ఉండండి… కుటుంబ సభ్యులతో కలిసి ఉండండి… అంతేకాని రోడ్లమీదకొచ్చి ఇబ్బందులు కలిగించే ప్రయత్నం మాత్రం చేయొద్దని చేతులు జోడించి వేడుకున్నారు. ఇదేమైనా జోక్ అనుకుంటున్నారా? … ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో ఉంది. మీరు జాగ్రత్తగా ఉండకపోతే… ఎవరిని రక్షించలేము. నేను సినిమాల్లో స్టంట్ చేస్తాను… కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి స్టంట్స్ మాత్రం చేయొద్దన్నారు. జీవితం చాలా విలువైనది .. దయచేసి ప్రభుత్వం చెప్పే వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కోరారు. కరోనాను అరికట్టేందుకు మనం చేయాల్సింది ఇదే.. మనకు వేరే ఆప్షన్ లేదు. జస్ట్ మీరు చేతులను శుభ్రం చేసుకుంటూ ఇంట్లో కూర్చోండి చాలన్నారు అక్షయ్.


Tags: Akshay Kumar, Bollywood, Lockdown, Govt, CoronaVirus, Covid 19

Next Story