‘అయ్యగారే నెంబర్ వన్’.. అభిమానిని కలవనున్న అఖిల్

by  |
Akkineni Akhil
X

దిశ, డైనమిక్ బ్యూరో: టాలీవుడ్‌లో సిసింద్రిగా అడుగెట్టి.. వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దసరాకు ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్’ సినిమాతో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఉన్న అఖిల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే, గతంలో అఖిల్ సినిమా చూసిన ఓ అభిమాని ‘అయ్యాగారే నెంబర్ వన్. అఖిలే తోపు. ఎవరి వల్లా కాదు.’ అంటూ హల్‌చల్ చేసిన విషయమూ తెలిసిందే. తాజాగా.. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఓ నెటిజన్ ఆ అభిమాని గురించిన అడిగిన ప్రశ్నకు అఖిల్ స్పందిస్తూ.. ‘‘నా ఫ్యాన్ ఇంత పాపులర్ కావడం సంతోషంగా ఉంది. ‘అయ్యగారే నెంబర్ వన్’ అనే పదం నా లైఫ్‌ని టేకోవర్ చేసింది. ఈ సినిమాలో కూడా ఆ స్లోగన్ వాడాము. ఆయనను ఓ సారి కలవాలి.’’ అంటూ అఖిల్ సంతోషం వ్యక్తం చేశారు.

https://www.instagram.com/p/CVLDwgypl5w/?utm_source=ig_web_copy_link



Next Story