‘తెలుగబ్బాయి.. గుజరాతీ అమ్మాయి’.. ఏంటో కథ?

by  |
‘తెలుగబ్బాయి.. గుజరాతీ అమ్మాయి’.. ఏంటో కథ?
X

దిశ, సినిమా : బిగ్ బాస్ సీజన్ – 4 కపుల్స్‌గా ఆడియన్స్‌ను ఆకట్టుకున్న అఖిల్, మోనాల్ గజ్జర్ హీరోహీరోయిన్లుగా ఓ వెబ్ సిరీస్ ప్రారంభమైంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ‘తెలుగబ్బాయి.. గుజరాతీ అమ్మాయి’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాగా.. మార్చి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. సరస్వతీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు భాస్కర్ బంటుపల్లి దర్శకులు.

కాగా మిత్రుడి సలహాతో అఖిల్, మోనాల్‌ను దృష్టిలో పెట్టుకుని స్టోరీ రాసుకున్నానని తెలిపారు డైరెక్టర్. నిర్మాత ఎ. భాస్కర్ రావుకు కథ చాలా నచ్చిందని, ఆడియన్స్‌ కూడా ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నట్లు తెలిపారు. గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన అమ్మాయి, పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన మిడిల్ క్లాస్ అబ్బాయిల మధ్య లవ్ స్టోరీనే కథ. కాగా ‘తెలుగబ్బాయి.. గుజరాతీ అమ్మాయి’ టైటిల్ తమకు ఆడియన్స్ ఇచ్చారన్న అఖిల్, మోనాల్.. సిరీస్ అందరికీ నచ్చేలా ఉంటుందన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed