సురేందర్ రెడ్డికి సరెండర్ అయిపోయిన అఖిల్..

94

దిశ, సినిమా : అక్కినేని అఖిల్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చాడు. ఇప్పటి వరకు లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలు మాత్రమే చేసిన అఖిల్.. హిట్ కోసం పంథా మార్చేశాడు. మూసధోరణిలో వెళ్లకుండా ప్రయోగానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే తన 5వ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన అఖిల్.. అదిరిపోయే మేక్‌ఓవర్‌తో కనిపించాడు. రఫ్ హెయిర్, చేతిలో సిగరెట్‌తో ‘ఏజెంట్‌’గా మాస్ అవతార్‌లో కనిపించిన అక్కినేని వారసుడు.. అఫీషియల్‌గా డైరెక్టర్ సురేందర్ రెడ్డికి సరెండర్ అయిపోయినట్లు తెలిపాడు. ఇంత యూనిక్‌ వేలో తనను క్రాఫ్ట్ చేసినందుకు డైరెక్టర్‌కు థాంక్స్ చెప్పాడు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, సురేందర్2సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..