Akhanda: 'అఖండ' షూటింగ్ ఫొటోలు వైరల్.. అఘోర లుక్‌లో బాలయ్య విశ్వరూపం

by  |
Akhanda: అఖండ షూటింగ్ ఫొటోలు వైరల్.. అఘోర లుక్‌లో బాలయ్య విశ్వరూపం
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వస్తున్న ‘అఖండ’ సినిమాపై టాలీవుడ్‌లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బాలయ్య బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కావడంతో.. ఈ హ్యాట్రిక్ సినిమా కోసం బాలయ్య అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అఖండ టీజర్, ఇందులోని డైలాగ్‌లు మాస్ డైలాగ్‌లు అభిమానులకు మంచి కిక్కిచ్చాయి. సినిమాలో ఇలాంటి డైలాగ్‌లు చాలా ఉండటంతో.. థియేటర్‌లో బాలయ్య విశ్వరూపం చూపించడం ఖాయమని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

తాాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. అఖండ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ఇవాళ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫొటోలను సినిమా యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్‌గా మారాయి. ఇందులో బాలయ్య అఘోర లుక్‌లో ఉండగా.. డైరెక్టర్ బోయపాటి సీన్‌ను వివరిస్తున్నాడు. బాలయ్య సీరియస్‌గా బోయపాటి చెప్పే విషయాన్ని వింటున్నాడు. బాలయ్య అఘోర లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Next Story