శరత్ కుమార్, జగపతిబాబులను పొగిడేసిన బాలీవుడ్ బ్యూటీ

by  |
శరత్ కుమార్, జగపతిబాబులను పొగిడేసిన బాలీవుడ్ బ్యూటీ
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ ఆకాంక్ష సింగ్ తెలుగులో ‘మీట్ క్యూట్’ ఆంథాలజీతో పాటు ‘ఘర్షణ’ వెబ్ సిరీస్ చేస్తోంది. పాండమిక్ టైమ్‌లోనూ వర్క్ కంటిన్యూ చేసిన హీరోయిన్.. ఈ సిరీస్‌లో శరత్ కుమార్, జగపతిబాబు లాంటి లివింగ్ లెజెండ్స్‌తో వర్క్ చేయడం అదృష్టంగా ఫీల్ అవుతున్నట్లు చెప్పింది. ఇందులో పవర్‌ఫుల్ మేల్ క్యారెక్టర్స్‌తో సమానమైన ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ ప్లే చేసిన తాను.. స్టోరీ చెప్పగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలిపింది. భాష అనేది తనకు అడ్డుగా లేదని.. ఒక గొప్ప కథలో భాగమయ్యే అవకాశం వస్తే బాలీవుడ్ మాత్రమే కాకుండా ఇతర ఇండస్ట్రీల్లో కూడా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానంది. మూవీ ఓటీటీ యాక్టర్స్‌ను డిఫరెంట్‌గా చూడటం ఇండస్ట్రీ సమస్యగా తెలిపిన ఆమె.. వెబ్ ప్లాట్‌ఫామ్ కోసం యూనిక్ మూవీస్ రూపుదిద్దుకుంటున్నాయని చెబుతూ.. తనలాగే చాలా మంది నటులు డిజిటల్ ప్రాజెక్ట్‌లు చేయడంతో పాటు సినిమా అవకాశాలు కూడా పొందుతున్నారని వివరించింది.

Next Story

Most Viewed