ఆటోలో ప్రయాణించిన అజిత్.. వీడియో వైరల్

by  |
Ajith Spotted Travelling In An Auto
X

దిశ, సినిమా : కోలీవుడ్ బాక్సాఫీస్ కింగ్ అజిత్.. తన ఫ్యాన్స్‌ను ఎప్పటికప్పుడు ఇన్‌స్పైర్ చేస్తూనే ఉంటాడు. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఎవరూ లేకుండా సూపర్ స్టార్‌గా ఎదిగిన ఆయన.. సింప్లిసిటీ, హానెస్టీకి కేరాఫ్ అడ్రస్‌. సెలబ్రిటీ స్టేటస్‌లో ఉండి కూడా తమిళనాడు స్టేట్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పార్టిసిపేట్ చేసి ఎనిమిది మెడల్స్ సాధించిన అజిత్.. ఇప్పుడు ఆటోలో ప్రయాణించి మరోసారి తన సింప్లిసిటీ నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ‘మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ’ అని ఎందుకు అంటారో ఇప్పుడు అర్థమవుతుందా? అంటూ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక అజిత్ ‘వాలిమై’ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉండగా, స్పెయిన్‌లో లాస్ట్ షెడ్యూల్‌తో సినిమా పూర్తి కానుంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed