ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న అజిత్

by  |
ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న అజిత్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ్ సూపర్ స్టార్ అజిత్ ‘వాలిమై’ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. హెచ్.వినోద్ డైరెక్టర్ చేస్తున్న సినిమా న్యూ షెడ్యూల్ హైదరాబాద్ రామెజీఫిల్మ్ సిటీలో స్టార్ట్ అయింది. షూటింగ్ స్పాట్‌లో అజిత్ స్వల్పంగా గాయపడగా..షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చాడు.

సెట్స్‌లో స్టంట్స్ చేస్తూ ప్రమాదానికి గురైన అజిత్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆయుర్వేద ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని సమాచారం. దీంతో మరో నెల తర్వాతే షూటింగ్ ప్రారంభించనుంది మూవీ యూనిట్. బోనీ కపూర్ నిర్మిస్తున్న వాలిమై సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తుండగా..టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ కీ రోల్ ప్లే చేస్తున్నారు. హ్యూమా ఖురేషి, యోగి బాబు ప్రధానపాత్రల్లో కనిపించబోతున్నారు. అజిత్ ఇంతకు ముందు కూడా ‘విశ్వాసం’ మూవీ చిత్రీకరణ సమయంలోనూ బైక్ స్టంట్ చేస్తూ గాయపడ్డారు.


Next Story

Most Viewed