మాట నిలబెట్టుకోలేకపోయిన బోనీ.. నిరాశలో అజిత్ ఫ్యాన్స్

by  |
thamil acter ajith
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ ఫ్యాన్ ఫాలోయింగ్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనకంటూ ఓ ఎరాను సృష్టించుకున్న తలా.. తెరపై కనిపించిన ప్రతీసారి తన ఫర్ఫార్మెన్స్‌తో మెస్మరైజ్ చేస్తుంటాడు. ఇక బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ‘పింక్’ రీమేక్‌గా అజిత్‌తో ‘నెర్కొండ పార్వాయి’ తీసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వినోద్ డైరెక్టర్ కాగా, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు. ప్రస్తుతం ఇదే కాంబినేషన్‌లో వస్తున్న అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘వాలిమై’. ఈ మూవీ అప్‌డేట్ గురించి ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మే 1న అజిత్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల కానుందని గతంలో ప్రకటించినా.. కొవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడప్పుడే ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయాల‌ని అనుకోవ‌డం లేద‌ని బోనీ క‌పూర్ ఓ ప్రకట‌న‌లో తెలిపారు. దీంతో ఫ్యాన్స్‌ నిరాశకు గురయ్యారు. ఇక ఈ సినిమాలో అజిత్‌కు జోడీగా బాలీవుడ్‌ భామ హ్యూమా ఖురేషీ నటిస్తుండగా, విలన్ రోల్‌లో టాలీవుడ్‌ హీరో కార్తికేయ కనిపించబోతున్నారు.



Next Story