అజయ్ డైరెక్షన్‌లో అమితాబ్

by  |
అజయ్ డైరెక్షన్‌లో అమితాబ్
X

దిశ, వెబ్‌డెస్క్ :
ఆ ఇద్దరూ కలిసి స్ర్కీన్ షేర్ చేసుకుని అప్పుడే ఏడేళ్లు గడిచిపోయాయి. వారి కాంబినేషన్‌లో వచ్చిన ‘మేజర్ సాహెబ్, ఖాకీ, సత్యాగ్రహ’ వంటి హిట్ సినిమాలు సెట్ చేసిన ఎక్స్‌పెక్టేషన్స్.. ఆ లెజెండ్స్ ఇద్దరూ కలిసి నటిస్తే చూసేందుకు ఇన్నాళ్లుగా ఎదురు చూశాయి. ద వెయిట్ ఈజ్ ఓవర్.. వాళ్లిద్దరూ కలిసి రావడమే కాదు, అందులో ఒకరి దర్శకత్వంలో మరొకరు నటించనున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో కాదు.. మెగాస్టార్ అమితాబ్, అజయ్ దేవగన్.

బిగ్ బీని డైరెక్ట్ చేయాలని చాలా మంది కోరుకుంటారు. అయితే ఆ అదృష్టం అందరికీ రాకపోవచ్చు. కానీ అజయ్‌ దేవగన్‌కు ఆ చాన్స్ దక్కినట్టు సమాచారం. అజయ్ దేవగన్ తొలిసారి మెగాఫోన్ పట్టబోతుండగా.. అందుకు రాసుకున్న స్క్రిప్ట్‌కు అమితాబ్ అయితేనే న్యాయం చేస్తాడని అజయ్ భావించాడని, ఈ ప్రాజెక్టుకు అమితాబ్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. ‘మేడే’గా రాబోతున్న ఈ సినిమా. థ్రిల్లింగ్ హ్యుమన్ స్టోరీ అని అజయ్ హింట్ ఇచ్చాడు. ఇందులో అజయ్ ‘పైలట్’గా నటించనున్నాడని సమాచారం. మరి మరో లీడ్ రోల్‌లో నటిస్తున్న అమితాబ్ పాత్ర ఏంటన్నది మాత్రం రివీల్ కాలేదు. మిగతా కాస్టింగ్ అంతా కూడా ఫైనలైజ్ అయిపోయినట్లు తెలుస్తోంది. అజయ్ తన సొంత బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తీస్తుండగా.. డిసెంబర్‌లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇక అజయ్ తానాజీ హిట్ తర్వాత ‘భుజ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అటు బిగ్ బీ కూడా కేబీసీ షూట్‌లో ఉన్నాడు. ఈ ఇద్దరూ ఈ రెండు ప్రాజెక్ట్‌లను ముగించుకుని మే డే షూట్‌లో పాల్గొంటారు. ‘మే డే’ అధికారిక ప్రకటన వస్తేనే అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.

Next Story