హిందీలోకి బ్రోచేవారెవరురా..

by  |
హిందీలోకి బ్రోచేవారెవరురా..
X

దిశ, వెబ్‌డెస్క్: మరో తెలుగు సినిమా హిందీలోకి రీమేక్ కాబోతుంది. శ్రీవిష్ణు, నివేదా థామస్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన సూపర్ హిట్ క్రైమ్ కామెడీ ‘బ్రోచేవారెవరురా’ సినిమా రీమేక్ రైట్స్‌ను బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కొనుగోలు చేశారు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్‌ రీమేక్ కోసం కరణ్ డియోల్, అభయ్ డియోల్‌ను మెయిన్ లీడ్ క్యారెక్టర్లుగా ఎంచుకున్నారని బీటౌన్ టాక్. నేటివిటీకి తగినట్లుగా సినిమా స్క్రిప్ట్ డిజైన్ చేయనున్న దేవగన్.. త్వరలో డైరెక్టర్‌ను డిసైడ్ చేయనున్నారని తెలుస్తోంది. కాగా ఈ సినిమా 2021 ప్రారంభంలో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం.


Next Story