మహిళను వంటింటి కుందేలుగా చూడొద్దు : ఐశ్వర్య

by  |
Aishwarya Rajesh
X

దిశ, సినిమా : మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సొసైటీలో మహిళల ఫీలింగ్స్‌కు ఏ మాత్రం గౌరవం లభిస్తుందనే కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా.. మహిళల పట్ల కుటుంబం నడుచుకునే విధానం ఇంత దారుణంగా ఉంటుందా అనే విషయంలో రియలైజేషన్ ఇస్తుంది. కాగా తమిళ్‌లో రీమేక్ అవుతున్న ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఐశ్వర్యా రాజేష్ తాజాగా ఫిల్మ్ ప్రోగ్రెస్‌పై స్పందించింది. ‘సాధారణంగా రీమేక్ సినిమాలకు సంబంధించి ఒరిజినల్‌లో ఉన్న సోల్ మిస్ కాకుండా చేయడం కష్టం. అందుకే ఇప్పటివరకు చాలా రీమేక్స్‌కు నో చెప్పా. అయితే ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ సినిమాను మాత్రం మిస్ చేసుకోకూడదని నిర్ణయించుకున్నా’ అని తెలిపింది. మహిళలను వంటింటి కుందేలుగా చూడకుండా, వారి భావాలను అర్థం చేసుకోవాలని ఈ చిత్రం ద్వారా సందేశమివ్వనున్నట్లు వెల్లడించింది.



Next Story