ఐశ్వర్య, ఆరాధ్యలకు నెగెటివ్

by  |
ఐశ్వర్య, ఆరాధ్యలకు నెగెటివ్
X

బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ రావడంతో దేశం మొత్తం ఆందోళనకు గురైంది. సీనియర్ బచ్చన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేశారు. బిగ్ బీకి పాజిటివ్ అని ప్రకటించిన గంటలోపే అభిషేక్ బచ్చన్‌కు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇద్దరూ ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరగా.. తర్వాతి రోజు ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్‌కు కరోనా వచ్చినట్లు తేలింది. కానీ వీరిద్దరినీ ఇంట్లోనే ఉంచి చికిత్స అందించారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఇద్దరికీ శ్వాస సంబంధిత సమస్యలు ఎదురు కావడంతో నానావతి ఆస్పత్రికి తరలించారు.

కాగా డైట్, వైద్యుల సూచనలు పాటిస్తూ చికిత్స తీసుకున్న ఆరాధ్య, ఐశ్వర్య కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. టెస్టులో నెగెటివ్ రావడంతో డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. అయితే అమితాబ్, అభిషేక్‌లకు కరోనా నెగెటివ్ రాకపోవడంతో వైద్యం కొనసాగిస్తున్నారు డాక్టర్లు.

Next Story

Most Viewed