లాక్‌డౌన్ కాలంలో ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్!

by  |
లాక్‌డౌన్ కాలంలో ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వల్ల ఏర్పడ్డ లాక్‌డౌన్ సమయంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ కొత్త డేటా ప్యాక్ తీసుకొచ్చింది. రూ. 401 ప్రీపెయిడ్ డేటా ప్యాక్‌ను విడుదల చేసింది. ఈ ప్యాక్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ సంవత్సరపాటు ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించింది. అలాగే, డేటా ప్రయోజనాలు కూడా ఉంటాయని వెల్లడించింది. ఒకరోజుకు 3 జీబీ డేటాతో 28 రోజుల వ్యాలిడిటీని అందించనుంది. ఈ ప్యాక్‌లో కాలింగ్, ఎస్ఎమ్ఎస్ సదుపాయాలుండవు. ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ సరికొత్త ప్యాక్‌తో అదనపు ప్రయోజనాలు ఉంటాయని సంస్థ చెబుతోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వీఐపీ ఏడాది చందా రూ. 399 ఉంది. ఇప్పుడు ఎయిర్‌టెల్ డేటా ప్యాక్ రూ. 401 ప్లాన్‌లో రోజుకు 3 జీబీ డేటా పొందవచ్చు. ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తయిన తర్వాత కూడా ఇది సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది.

ఇదికాకుండా ఎయిర్‌టెల్‌లో రూ. 398 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఇలాంటిదే. ఇందులో అమెజాన్ ప్రైం సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందే అవకాశముంది. ఈ ప్లాన్‌లో రోజుకు 3 జీబీ డేటా మాత్రమే కాకుండా ఉచిత వాయిస్ కాలింగ్, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలను పొందవచ్చు. అమెజాన్ ప్రైం చందా కోసమైతే రూ. 999 చెల్లించాల్సి ఉంది. అదే ఎయిర్‌టెల్ ప్లాన్‌లో వాయిస్ కాలింగ్, ఎస్ఎమ్ఎస్, డేటా ప్రయోజనాలతో పాటు రూ. 398కే అమెజాన్ ప్రైమ్ చందాను పొందవచ్చు.

Tags: Airtel, prepaid pack,free Disney+ Hotstar, Disney+ Hotstar VIP subscription, coronavirus, covid-19, lockdown


Next Story