- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫుల్‌గా తాగి వేరే ఇంట్లో దూరిన మాజీ ఎంపీ.. తర్వాత ఏమైందంటే.?
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఆయన ఓ ప్రజాప్రతినిధి. ఏకంగా పార్లమెంట్‌కే ఎన్నికైన సీనియర్ నాయకుడు. అలాంటి ఓ వ్యక్తి ఏకంగా పీకలా దాకా తాగి వేరే ఇంట్లోకి వెళ్లడంతో వారు ఆయనపై దాడి చేశారు. అనంతరం ఆ ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంతకీ ఆయన ఎవరంటే.. తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే మాజీ ఎంపీ గోపాలకృష్ణన్. వివరాల ప్రకారం.. దీపావళి పండుగరోజు మద్యం సేవించిన గోపాలకృష్ణన్ పొరపాటున నీలగిరి ముత్యాలమ్మన్‌పేట్‌లోని ఓ ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : ఆయన ఓ ప్రజాప్రతినిధి. ఏకంగా పార్లమెంట్‌కే ఎన్నికైన సీనియర్ నాయకుడు. అలాంటి ఓ వ్యక్తి ఏకంగా పీకలా దాకా తాగి వేరే ఇంట్లోకి వెళ్లడంతో వారు ఆయనపై దాడి చేశారు. అనంతరం ఆ ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంతకీ ఆయన ఎవరంటే.. తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే మాజీ ఎంపీ గోపాలకృష్ణన్.
వివరాల ప్రకారం.. దీపావళి పండుగరోజు మద్యం సేవించిన గోపాలకృష్ణన్ పొరపాటున నీలగిరి ముత్యాలమ్మన్‌పేట్‌లోని ఓ ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే ఆయన ప్రవర్తనపై ఆగ్రహించిన ఇంటి యజమాని గోపాలకృష్ణన్‌పై దాడి చేశాడు. అనంతరం ఆయనపై పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. అయితే తమకు ఆయన మాజీ ఎంపీ అనే విషయం తెలియదని సదరు ఇంటి యజమాని తెలిపారు.
కాగా.. గోపాలకృష్ణన్ 2014-19 కాలంలో నీలగిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇంత జరిగినా గోపాలకృష్ణన్ మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని చెప్పడం విశేషం.






