ఎన్నికల ప్రచారం… బట్టలు ఉతికిన అభ్యర్థి(వీడియో)

by  |
ఎన్నికల ప్రచారం… బట్టలు ఉతికిన అభ్యర్థి(వీడియో)
X

దిశ,వెబ్ డెస్క్: తమిళనాడులో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అభ్యర్థులు తమ ప్రచారాలను ముమ్మురం చేసారు. ఎన్నికల ప్రచారంలో నాయకులు ప్రజలకు ఏమి కావాలన్న చేస్తామని హామీలు ఇస్తారు. ఇంకా నమ్మించడానికి ఏ పనులైనా చేస్తారు. తాజాగా ఒక అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో బట్టలు ఉతికి సంచలనంగా మారాడు. అన్నాడీంఎకే అభ్యర్థి తంగ కత్తిరావన్ అనే ఎమ్మెల్యే అభ్యర్థి నాగ‌ప‌ట్ట‌ణంలో ఎన్నికల ప్రచారం చేపట్టాడు.

ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను తమకు ఓట్లు వేయాలని కోరాడు. ఇంతలో ఒక మహిళ బట్టలు ఉతుకుతుండగా.. ఆమెను పక్కకు లేపి ఆ బట్టలను కత్తిరావన్ చకచకా ఉతికేసాడు. అంతేకాకుండా తనను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే వాషింగ్ మెషిన్లను ఇప్పిస్తామని, మహిళలకు కష్టాలు తప్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఓట్ల కోసం నాయకులు ఏమైనా చేస్తారు. ఒక్కసారి గెలిచికా ప్రజల వంక కనెత్తి కూడా చూడరు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 6 న జరగనున్నాయి.

Next Story

Most Viewed