టాక్ షో హోస్ట్‌గా బాలయ్య .. సోషల్ మీడియాలో దూసుకెళ్తున్న ప్రోమో

by  |
టాక్ షో హోస్ట్‌గా బాలయ్య .. సోషల్ మీడియాలో దూసుకెళ్తున్న ప్రోమో
X

దిశ, సినిమా: తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ సూపర్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమాలు, సిరీస్‌లు మాత్రమే కాకుండా టాక్ షోలతో కూడా దూసుకెళ్తోంది. ఇప్పటికే రానా దగ్గుబాటి, సమంత వంటి ప్రముఖ స్టార్స్ తో టాక్ షోలు నిర్వహించిన ఆహా.. ప్రస్తుతం మరో టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ పేరుతో రానున్న ఈ టాక్ షోతో నటసింహం నందమూరి బాలకృష్ణ ఫస్ట్ టైం హోస్ట్‌గా వ్యవహరించడం విశేషం. దీంతో ఈ షోపై నందమూరి ఫ్యాన్స్‌తో పాటు, ఆడియన్స్‌లో కూడా ఆసక్తి నెలకొంది. బాలయ్య బాబు హోస్ట్‌గా టాక్ షో వస్తుందన్న విషయాన్ని ఘనంగా అనౌన్స్ చేసిన ఆహా.. ఇందుకు సంబంధించిన ప్రోమోను రీసెంట్‌గా రిలీజ్ చేసింది. దీంతో ఎప్పుడెప్పుడు షో మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

కాగా, అన్ స్టాపబుల్ షో ఫస్ట్ ఎపిసోడ్ నవంబరు 4న ప్రసారం కానుంది. 12 ఎపిసోడ్లుగా ప్రసారం కానున్న ఈ షోలో బాలకృష్ణ మొదటగా ఎవరిని ఇంటర్వ్యూ చేయనున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే బాలయ్య షో కు మొదటి గెస్ట్‌గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రాబోతున్నాడని తెలుస్తోంది. ఇక వచ్చిన గెస్ట్‌లను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? షో ఏవిధంగా డిజైన్ అయిందని తెలుసుకునేందుకు వెయిట్ చేయక తప్పదు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed