Terrace Gardening : పంటలు పండించాలంటే పొలమే ఉండాల్సిన పనిలేదు గురూ..!

by Muthe.Rajitha |

పంటలు(Crops) పండించాలంటే(Farming) కనీసం రెండు ఎకరాల భూమి ఉండాలి.

Terrace Gardening : పంటలు పండించాలంటే పొలమే ఉండాల్సిన పనిలేదు గురూ..!
X

దిశ, వెబ్ డెస్క్ : పంటలు(Crops) పండించాలంటే(Farming) కనీసం రెండు ఎకరాల భూమి ఉండాలి. కూరగాయలు(Vegetables) పండించాలన్నా ఎకరం స్థలం అయినా ఉండాల్సిందే అని మనం అభిప్రాయ పడతాం. కానీ ఎకరాల కొద్దీ భూములు లేకపోయినా పంటలు పండించవచ్చు. అందులోనూ కూరగాయల సాగు అయితే మరీ సులభం అని మీలో ఎంతమందికి తెలుసు. భూమి లేకుండా సాగు ఎలా అనుకుంటున్నారా? అదే మిద్దెతోట(Terrace Gardening) సాగు. గ్రామాల్లో నివసించే వారికి ఎంతోకొంత ఇంటివెనకాల పెరడు వంటి స్థలం అయినా ఉంటుంది కానీ నగరాల్లో, పట్టణాల్లో నివసించే వారికి ఆ మాత్రం స్థలం కూడా ఉండదు. గార్డెనింగ్ చేయాలని ఉన్నా కూడా స్థలాభావం వలన సాధ్యం కాదు. కానీ మొక్కలు పెంచాలనే ఆలోచన ఉంటే చాలు.. చాలా క్రియేటివ్‌గా టెర్రస్ గార్డెనింగ్ చేయవచ్చు. ఒక చిన్నపాటి ఇంటి టెర్రస్‌పైనే ఏకంగా500 రకాల కూరగాయలు, పండ్ల మొక్కలను పెంచవచ్చు.

అన్ని రకాల మొక్కలతో చిన్న తోటనే ఇంటి మీదకు తీసుకు రావడం అసాధ్యమేమి కాదు. రెగ్యులర్‌గా మార్కెట్లో లభించే వాటితో పాటు అరుదుగా ఉండే జాతి మొక్కలు, పండ్లు, కూరగాయలు, పూలు, మూలిక మొక్కలను కూడా సులభంగా పెంచవచ్చు. అంతేకాదు టెర్రస్ గార్డెనింగ్ చేయాలి అనుకునేవారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందివ్వాడమే కాకుండా.. శిక్షణ, గార్డెనింగ్ కిట్స్ కూడా ఉచితంగానే ఇస్తోంది. వంకాయ, దొండకాయ, పాలకూర, ఉసిరికాయ, ముల్లంగి, క్యారెట్లు, దోసకాయలు, కరివేపాకు వంటి రెగ్యులర్ కూరగాయలతో పాటు జామ, బొప్పాయి, నిమ్మ వంటి పండ్ల మొక్కలు కూడా పెంచవచ్చు. ఆయుర్వేదంలో ఉపయోగపడే మొక్కలను, సుగంధ ద్రవేయాలను పండిస్తే బయట అమ్ముకోవచ్చు. ఇక మార్కెటింగ్ టెక్నాలజీ కూడా జత చేస్తే.. టెర్రస్ గార్డెనింగ్ లో పండించే పంటలను ఆన్లైన్ వేదికగా అమ్మడం ద్వారా డబ్బు కూడా సంపాదించవచ్చు.

Next Story