PM-KISAN: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్‌ నిధుల విడుదల

by Prasad Jukanti |

పీఎం కిసాన్‌ నిధులను ప్రధాని మోడీ విడుదల చేశారు.

PM-KISAN: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్‌ నిధుల విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోని అన్నదాతలకు ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) శుభవార్త చెప్పారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-KISAN scheme) 21వ విడత నిధులను ఇవాళ విడుదల చేశారు. తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని ఇవాళ కోయంబత్తూర్‍లోని కార్యక్రమంలో 9 కోట్ల మంది లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి రూ.18, వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు. కాగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ఫిబ్రవరి 24, 2019 న ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హత కలిగిన దేశంలోని రైతు కుటుంబాలకు ఏడాదికి రూ. 6,000 ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఒక్కో విడతలో రూ. 2 వేల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తోంది.

Next Story