- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Keera Dosa: రైతులకు వరంగా మారిన కీర దోస.. 90 రోజుల్లో రూ. లక్ష ఆదాయం
తక్కువ సమయంలో వచ్చే కీర దోస సాగుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు

దిశ, వెబ్ డెస్క్ : రైతులు లాభ , నష్టాలు చూసుకోకుండా పంటలు పండిస్తారు. తక్కువ సమయంలో వచ్చే కీర దోస సాగుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. గ్రామంలో 10 మంది రైతులు ఉంటే 8 మంది ఈ పంటను పండిస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఎందుకంటే, ఇది 90 రోజుల్లోనే చేతికి రావడంతో, కౌలుకి భూమి తీసుకుని మరి సాగు చేస్తున్నారు. ఒక ఎకరంలో కీర దోసను పండిస్తే లక్షన్నర వరకు ఆదాయం వస్తుందని చెబుతున్నారు.
30 రోజులకు పూత మొదలయ్యి 90 రోజుల్లో పంట పూర్తిగా చేతికి వస్తుంది. కోత మొదటి రోజు నుంచి 30 కోతలు వస్తాయి. ఒక ఎకరం సాగు చేస్తే రూ.30 వేల వరకు ఖర్చు అవుతుంది. దిగుబడి పెంచడానికి కర్రలతో నిలువు పందిరి వేయాలి. పంట కోత తర్వాత, గ్రేడింగ్ చేస్తే మార్కెట్ వాళ్లు మీ తోట వద్దకి కొనుగోలు చేస్తారు. ఇది నాలుగు రకాలుగా ఉంటుంది. గ్రేడింగ్ వారీగా రైతులకు డబ్బును చెల్లిస్తారు.
పెట్టుబడికి కష్టంగా ఉంటే.. విత్తనాలు, పందిరికి అయ్యే ఖర్చు మొత్తం కంపెనీ వారు చూసుకుంటారని రైతులు చెబుతున్నారు. కోత కోసినప్పుడు కూలీల ఖర్చు రైతులు భరించాలి. కోసిన పంటను నాలుగు భాగాలుగా వేరు చేసి, క్వాలిటీని బట్టి ధరను చెల్లిస్తారు. పండించిన పంటకు కంపెనీ పెట్టిన పెట్టుబడులు మినహాయించుకొని మిగిలి న డబ్బును అకౌంట్లో వేస్తారని రైతులు చెబుతున్నారు.






