- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GST: రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్.. వాటిపై జీరో జీఎస్టీ!
జీఎస్టీ సంస్కరణలో భాగంగా రైతులకు భారీ ప్రయోజనం చేకూర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ దీపావళికి దేశ ప్రజలకు డబుల్ బొనాంజా అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట ప్రసంగంలో చేసిన ప్రకటన దేశంలోని రాజకీయ, వ్యాపార వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. జీఎస్టీలో సంస్కరణలు (GST Reforms) తీసుకురావడంతో పాటు పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం తీసుకోబోతున్నట్టు మోడీ చెప్పారు. ప్రధాని చేసిన ఈ ప్రకటనతో జీఎస్టీలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయనే సర్వత్రా చర్చ జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం రైతులకు (Farmers) మరో భారీ గుడ్‌న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయంలో ఉపయోగపడే పలు నీటిపారుదల పరికరాలపై జీరో జీఎస్టీ (Zero GST) విధించేలా కీలక ప్రతిపాదన చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా స్పింకర్లు లాంటి పరికరాలపై జీఎస్టీ ఎత్తివేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రైతులపై వ్యయభారం భారీగా తగ్గి సాగు ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అలాగే సైకిళ్లపై ఇప్పుడున్న 12 శాతం శ్లాబ్ నుంచి 5 శాతం శ్లాబ్‌కు తగ్గే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.






