Agriculture: ఆ పూల సాగుతో ఎకరానికి లక్ష రూపాయలు పొందొచ్చని తెలుసా?

by Phanindra |

సంగారెడ్డి పూల మార్కెట్లో కిలో రూ.100-150 ధరకు పలుకుతుంది

Agriculture: ఆ పూల సాగుతో ఎకరానికి లక్ష రూపాయలు పొందొచ్చని తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఒక బిజినెస్ మెన్ వ్యాపారాల్లో నష్టపోతే రెండో సారి పెట్టుబడులు కూడా పెట్టరు. కానీ, రైతు అలా కాదు ఎంత నష్టం వచ్చిన సరే అదేం పట్టించుకోకుండా ఏదొక పంట వేస్తాడు. వేసిన పంటకి సరైన ధరలు లేక అల్లాడిపోతుంటారు. అయినా కూడా వ్యవసాయం వేయడం మాత్రం మానరు. చాలా మంది కూరగాయలు, పండ్లను సాగు చేస్తుంటారు. అయితే, అన్నింటిలో లిల్లీ పూలతో ఎక్కువ లాభాలు పొందవచ్చని రైతులు చెబుతున్నారు.

సంగారెడ్డి జిల్లాకి చెందిన రైతులు 10 ఎకరాల భూమిలో లిల్లీ పూలను సాగు చేస్తూ డబ్బును సంపాదిస్తున్నారు. మొదటి ఏడాది మొత్తం మొక్కలు పెరిగి పెద్దవుతాయి. రెండో ఏడాది నుంచి మొగ్గ మొదలయ్యి పూలుగా పూస్తాయి. ఇలా ప్రతిరోజూ 100- 120 కిలోల పూలను కట్ చేసి ఫ్లవర్ మార్కెట్లో అమ్ముతారు.

ప్రస్తుతం, హైదరాబాద్‌లో కిలో లిల్లీ పూల ధర రూ.200-250 వరకు నడుస్తుంది. సంగారెడ్డి పూల మార్కెట్లో కిలో రూ.100-150 ధరకు పలుకుతుంది. ఈ పూల సాగు చలికాలం నుంచి వేసవికాలం వరకు సాగు చేస్తారు. సాధారణ సమయంలో రేట్లు నార్మల్ గా ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్ సమయంలో చెప్పాల్సిన అవసరమే లేదు ఈ పువ్వులకు అధిక డిమాండ్ ఉంటుంది. దీని వలన రైతులు లాభపడతారు. ఈ పంట కోసం ఎక్కువ శ్రమించాల్సిన అవసరం లేదు. సాగు చేసేటప్పుడు పిచికారి లేకుండా పండించవచ్చు. ఒక్క ఎకరానికి లక్ష రూపాయల లాభం వచ్చే అవకాశముందని రైతులు తెలిపారు. అంటే ధర ఉంటే రెట్టింపు డబ్బు పొందొచ్చు.

Next Story