కాఫీ సాగు..1.50 లక్షల ఆదాయం.. అంతర పంటలతో మరింత రాబడి !

by velandi.Saikiran |   (  Updated:2025-08-09 05:29:30  IST  )

కాఫీ అంతర పంటగా మిరియాలు వేసుకుంటే.. ఏడాదికి లక్ష రూపాయల నుంచి 1,50,000 వరకు వచ్చే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు.

కాఫీ సాగు..1.50 లక్షల ఆదాయం.. అంతర పంటలతో మరింత రాబడి !
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం... రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో కొత్త పంటలు వేసేలా రైతులను ఆకర్షిస్తోంది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఇప్పుడు కాఫీ సాగు పెంచేలా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే.. అల్లూరి పరిధి పాడేరు ఐటిడిఏ పరిధిలో లక్ష ఎకరాలలో కాఫీ సాగు ( coffee CROP ) చేయాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం కొన్ని వేల ఎకరాల చొప్పున ఐదు సంవత్సరాలలో మొత్తం లక్ష ఎకరాలను సాగులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఉచితంగానే విత్తనాల పంపిణీ

అయితే ఈ కార్యక్రమం సక్సెస్ చేసేందుకు రైతులకు ఉచితంగా కాఫీ విత్తనాలను అందించేందుకు సిద్ధమైంది. అల్లూరి పరిధిలో చాలామంది గిరిజనులే వ్యవసాయం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ల చేత కాఫీ సాగు చేయించాలని అనుకుంటున్నారు. ఇక అంతర పండగ మిరియాలు సాగు చేసుకునేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు పరిశీలించి ప్రకటన చేయబోతున్నారు. అయితే అంతర పంటగా మిరియాలు వేసుకుంటే.. ఏడాదికి లక్ష రూపాయల నుంచి 1,50,000 వరకు వచ్చే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు.

మిర్యాలతో పాటు.. కాయగూరలు కూడా అంతర పంటలుగా.. వేసుకోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవంగా కాఫీ పంటకు నీడ చాలా అవసరమని చెబుతున్నారు. కాబట్టి అరణ్య ప్రాంతాల్లోనే కాఫీ పంట... బాగా దిగుబడి వస్తుంది. ఇక ఈ పంటకు సంవత్సరానికి 2500 మిల్లీమీటర్ల వర్షపాతం అవసరం అవుతుంది. ఎర్రమట్టి నేల ఈ పంటకు అనుకూలం. నర్సరీలో ఈ మొక్కలను పెంచి ఆ తర్వాత నాటుకోవాల్సి ఉంటుంది. వర్షపాతం లేని వాళ్ళు.. డ్రిప్ లేదా స్ప్రింక్లర్స్ వాడితే సరిపోతుంది. ఇక కాఫీ క్వింటాల్ కు 19350 వరకు పడుతోందని చెబుతున్నారు. అలాగే మిరియాల క్వింటాల్ కు 35000 వరకు ఉంటుందని చెబుతున్నారు. అంటే ఈ రెండు పంటలు కలిపి రైతు పండిస్తే లాభాలు ఎక్కువగానే వస్తాయన్నమాట.




Next Story